న్యూఢిల్లీ : హైవేపై వెళుతున్న చెరకు ట్రక్‌ను ఏనుగు నిలిపివేసిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో చూపిన సైన్బోర్డ్ ఆధారంగా థాయ్‌లాండ్‌లో ఈ ఘటన జరిగినట్టు వెల్లడైంది. డాక్టర్ అజయిత ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పటివరకూ 1.95 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో హైవే పక్కన ఏనుగు నిలబడిఉండటం కనిపిస్తుంది.
The Toll Tax collector…. pic.twitter.com/gCg47mmJZm
— Dr. Ajayita (@DoctorAjayita) March 6, 2023
కాషన్-ఎలిఫెంట్ క్రాసింగ్ అనే సైన్బోర్డ్ పక్కనే నిలుచున్న ఏనుగు అటుగా వస్తున్న చెరకు ట్రక్‌ను ఆపి అందులో నుంచి చెరకును తినడం ప్రారంభిస్తుంది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ది టోల్ ట్యాక్స్ కలెక్టర్ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఏనుగు ట్రక్కుపై దాడి చేయకుండా ఆకలి తీర్చుకునేందుకు కొంత చెరకును తీసుకోవడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ ఏనుగు చాలా తెలివైందని ఎలిఫెంట్ క్రాసింగ్ అనే బోర్డు వద్దే అది నిలుచుందని ఓ యూజర్ కామెంట్ చేశారు.
Read More :