Holi Greetings | అభిమానులకు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా హోలీ శుభాకాంక్షలు.. ఇన్‌స్టాలో ఏ ఫొటోలు పెట్టారో తెలుసా..?
Holi Greetings | బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు, నూతన దంపతులు అయిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా అభిమానులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వివాహం జరిగి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తవడం, ఇవాళే హోలీ పండుగ కావడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో వారి హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు, నూతన దంపతులు అయిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా అభిమానులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వివాహం జరిగి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తవడం, ఇవాళే హోలీ పండుగ కావడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో వారి హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. సేమ్ పోస్టును ఇద్దరూ జాయింట్‌గా షేర్ చేస్తూ ‘హ్యాప్పీ హోలీ ఫ్రమ్ మి అండ్ మై లవ్ టు యూ అండ్ యువర్స్ (నా తరఫున, నా లవ్ తరఫున మీకు, మీ లవ్‌కు హోలీ పండుగ శుభాకాంక్షలు)’ అనే క్యాప్షన్ ఇచ్చారు.
ఆ పోస్టులో అభిమానులు మునుపెన్నడూ చూడని మూడు అరుదైన ఫొటోలు ఉన్నాయి. అ ఫొటోల్లో పీచ్ సూట్ సెట్లో కియారా చాలా అందంగా మెరిసిపోతున్నది. సిద్ధార్థ్ కాషాయం కుర్తా ధరించి ఉన్నాడు. కియారా ఫ్లోరల్ ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ వేసుకుంది. మొదటి ఫొటోలో ఇద్దరూ ఒకరి కళ్లలో ఒకరు కళ్లు పెట్టి చూస్తున్నారు. రెండో ఫొటోలో ఇద్దరూ ముఖాలకు పసుపు రాసుకుని ఫొటోకు ఫోజిచ్చారు. మూడో ఫొటోలో సిద్ధార్థ్ ముఖంపై ఎక్కువగా అంటిన పసుపును కియారా తుడుస్తున్నది.
కాగా, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం గత నెల 7న రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో, అనంతరం ముంబైలో వారు తమ దగ్గరి బంధువులు, స్నేహితులకు విందు ఇచ్చారు. ఈ జంట 2021లో విడుదలైన షేర్షా సినిమా షూటింగ్ సందర్భంగా ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Vidya Balan: విద్యాబాలన్ బోల్డ్ ఫోటోషూట్.. ఇంటర్నెట్లో పిక్ దుమారం
Bedurulanka 2012 | బెదురులంక 2012 నుంచి వెన్నెల్లో ఆడపిల్లా రొమాంటిక్ ట్రాక్
NBK108 | బాహుబలి భామతో బాలయ్య ఫైటింగ్.. ఇది కదా మాస్ అంటే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

