Bedurulanka 2012 | బెదురులంక 2012 నుంచి వెన్నెల్లో ఆడపిల్లా రొమాంటిక్ ట్రాక్
కార్తికేయ (Kartikeya) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ బెదురులంక 2012 (Bedurulanka2012). ఈ మూవీ ఫస్ట్ సింగిల్ వెన్నెల్లో ఆడపిల్లా పాట (Vennello Aadapilla Lyrical)ను లాంఛ్ చేశారు మేకర్స్.
ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ బెదురులంక 2012 (Bedurulanka2012). క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్నాడు. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఈ మూవీ ఫస్ట్ సింగిల్ వెన్నెల్లో ఆడపిల్ల పాటను లాంఛ్ చేశారు మేకర్స్. వైట్ అండ్ వైట్ షర్ట్, లుంగీ లుక్కు మ్యాచింగ్ అయ్యే తలపాగాలో ఉన్న నేహాశెట్టిని కార్తికేయ ఫాలో అవుతూ వెన్నెల్లో ఆడపిల్లా (Vennello Aadapilla Lyrical).. కవ్వించే కన్నెపిల్లా.. కోపంగా చూస్తే ఎల్లా.. క్షణంలో అగ్గిపుల్లా అంటూ పాడుకుంటున్నాడు.
రొమాంటిక్‌గా, మెలోడియస్గా సాగుతున్న ఈ పాటను కిట్టు విస్పా ప్రగడ రాయగా.. హారికా నారాయణ్, జేవీ సుధాన్ష్ పాడారు. మణిశర్మ కంపోజిషన్‌లో సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన బెదురులంక 2012 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, గ్లింప్స్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్టులో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. బెదురులంక 2012 విలేజ్ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోంది. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్సమకూరుస్తున్నాడు.
లౌక్య ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వెన్నెల్లో ఆడపిల్ల రొమాంటిక్ ట్రాక్..
బెదురులంక 2012 గ్లింప్స్ వీడియో..
బెదురులంక 2012 మోషన్ పోస్టర్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

