హైదరాబాద్: బాలీవుడ్ నటి విద్యాబాలన్(Vidya Balan) బోల్డ్ ఫోటోషూట్లో పాల్గొన్నది. ద డర్టీ పిక్చర్(The Dirty Picture) హీరోయిన్ ఇచ్చిన కొత్త లుక్ అందర్నీ స్టన్ చేస్తోంది. ఇక ఇంటర్నెట్లో ఆ కొత్త ఫోటో కామెంట్ల వర్షం కురిపిస్తోంది. విద్యాబాలన్పై కొందరు నెటిజన్లు ఆ ఫోటో చూసి ఫైర్ అవుతున్నారు. డబ్బూ రత్నాని(Dabboo Ratnani) ఫోటోషూట్ కోసం విద్యాబాలన్ ఓ కొత్త ఫోటోను దిగింది. ఆ ఫోటోను డబ్బూ రత్నాని తన ఇన్స్టాలో పోస్టు చేశాడు.
కుర్చీపై కూర్చుని.. దుస్తులు లేకుండా ఉన్న విద్యాబాలన్.. ఒక చేతిలో న్యూస్ పేపర్.. మరో చేతిలో టీ గ్లాస్ పట్టుకుని కూర్చున్నది. ఈ ఫోటోలో కొంత రొమాంటిక్గా విద్యా లుక్స్ ఇచ్చింది. హీల్స్ .. సన్గ్లాస్లతో దర్శనమిస్తున్న విద్యాబాలన్ ఫోటో ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది. విద్యా కొత్త అవతారంపై కొందరు ట్రోల్స్(trolls) చేస్తున్నారు. అదో డర్టీ పిక్చర్ అంటూ పోస్టు పెడుతున్నారు.
పరిణీత, ఇష్క్కియా, నో వన్ కిల్డ్ జెస్సికా, ఖహాని గురు, పా లాంటి చిత్రాల్లో విద్యాబాలన్ నటించారు. ఇక సిల్క్ స్మిత(Silk Smitha) జీవిత కథాంశంతో తీసిన డర్టీ పిక్చర్ ఆమె కెరీర్లో మరో హైలెట్. భూల్ భులయ్యా, లగే రహో మున్నా భాయ్, మిషన్ మంగల్, బేగం జామ్ లాంటి చిత్రాల్లోనూ ఆమె చేశారు. ప్రస్తుతం నియత్ అనే చిత్రంలో ఆమె నటిస్తోంది. ఆ ఫిల్మ్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది.