NBK108 | బాహుబలి భామతో బాలయ్య ఫైటింగ్.. ఇది కదా మాస్ అంటే
'అఖండ'తో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చిన బాలయ్య అదే జోష్‌తో సంక్రాంతికి 'వీరసింహా రెడ్డి'తో వచ్చాడు. తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. టాక్‌తో సంబంధంలేకుండా కళ్లు చెదిరే కలెక్షన్లతో వంద కోట్ల బొమ్మగా నిలిచింది.
NBK108 Movie | ‘అఖండ’తో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చిన బాలయ్య అదే జోష్‌తో సంక్రాంతికి ‘వీరసింహా రెడ్డి’తో వచ్చాడు. తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. టాక్‌తో సంబంధంలేకుండా కళ్లు చెదిరే కలెక్షన్లతో వంద కోట్ల బొమ్మగా నిలిచింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్ స్టార్ హీరోలకు బాలయ్య పోటీగా నిలుస్తున్నాడు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ, అనీల్ రావిపూడితో సినిమాకు సిద్దమవుతున్నాడు. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనీల్.. తొలిసారి బాలయ్యతో అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాను తెరకెక్కించడానికి ముస్తాబవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో బాలయ్యతో ఢీ కొట్టే విలన్‌గా బాలీవుడ్ భామ నోరా ఫతేహి నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయని టాక్. ఈ మూవీలో నోరా పాత్ర చాలా వైలెంట్‌గా ఉండనున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా నోరాకు బాలయ్యకు మధ్య ఓ ఫైటింగ్ సీన్‌ను కూడా అనిల్ ప్లాన్ చేశాడట. అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని టాక్. ఏదేమైనా బాలయ్యతో బాలీవుడ్ భామ ఢీ కొట్టనుందనడంతో ఈ సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. గతంలో నోరా ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ సాంగ్‌లో కనిపించింది. మళ్లీ దాదాపు 8ఏళ్ల తర్వాత తెలుగులో సినిమా చేస్తుంది.

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య తండ్రి పాత్ర పోషించనున్నాడు. యంగ్ సెన్సేషన్ శ్రీలీల బాలయ్య కూతురుగా నటించనుంది. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించనుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి దసరా బరిలో ఈ సినిమాను దింపాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

