న్యూయార్క్ : సుమో రెజ్లర్‌తో బిలియనీర్ ఎలన్ మస్క్ బాహీబాహీకి దిగిన పాత ఫొటో ఒకటి నెట్టింట వైరల్ (Viral Post) అవుతోంది. ఈ ఇమేజ్‌లో మస్క్ సుమో రెజ్లర్‌తో తలపడటం కనిపిస్తుంది. ఈ వైరల్ పిక్చర్‌ను డోజ్ డిజైనర్ అనే పేజ్ ట్విట్టర్లో షేర్ చేసింది.
Elon Musk fighting a sumo wrestler. @elonmusk pic.twitter.com/HKiwOM5PaL
— DogeDesigner (@cb_doge) March 5, 2023
ఈ ఫొటోలో సుమో రెజ్లర్‌తో టెస్లా చీఫ్, ట్విట్టర్ నయా బాస్ మస్క్ తలపడుతున్నారు. సుమో రెజ్లర్‌తో పోరాడుతున్న ఎలన్ మస్క్ అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌పై బిలియనీర్ మస్క్ స్పందిస్తూ డిస్క్ నలగడంతో ఎనిమిదేండ్లు నొప్పితో బాధపడ్డాను అని మస్క్ కామెంట్ చేశారు.
ఈ పోస్ట్‌పై పెద్దసంఖ్యలో ట్విట్టర్ యూజర్లు రియాక్టయ్యారు. సరైన సమయంలో మస్క్‌ను ఇలా చూడటం గుడ్ ఐడియా అని ఓ యూజర్ రాసుకురాగా, మస్క్ రఫ్‌గా కనిపిస్తున్నాడని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :
Pathaan Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న పఠాన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Meta Platforms: వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న మెటా