Meta Platforms: వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న మెటా
Meta Platforms: ఉద్యోగులపై భారీ వేటు వేయనున్నది మెటా సంస్థ. మరోసారి వేల సంఖ్యలో ఎంప్లాయిస్ను తొలగించే ప్రక్రియలో ఆ కంపెనీ ఉన్నట్లు ఓ రిపోర్టు ద్వారా వెల్లడైంది. వచ్చే వారంలోగా దీనికి సంబంధించిన సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సోషల్ నెట్వర్క్ సైట్ల ఓనర్ మెటా ఫ్లాట్‌ఫామ్స్(Meta Platforms) కంపెనీ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వేల మందిపై వేటు వేసే ప్రక్రియలో ఆ కంపెనీ ఉన్నట్లు తాజా సమాచారం ద్వారా వెల్లడైంది. ఈ వారంలోనే ఆ లేఆఫ్స్(Layoffs)కు సంబంధించిన వార్త వెలుబడే ఛాన్సు ఉందని ఓ రిపోర్టు పేర్కొన్నది. గత ఏడాది నవంబర్‌లో ఆ కంపెనీ 13 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. అయితే తాజా రిపోర్టు ప్రకారం మళ్లీ భారీ స్థాయిలో ఉద్యోగుల కుదింపునకు ఆ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తొలి దశలో సుమారు 11 వేల మంది ఉద్యోగుల్ని మెటా సంస్థ తొలగించిన విషయం తెలిసిందే. అయితే సంస్థలో ఫైనాన్షియల్ టార్గెట్ల(Financial Targets)ను అందుకునే ఉద్దేశంతో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగనున్నట్లు భావిస్తున్నారు. మేనేజర్లకు ప్యాకేజీలు ఇచ్చి వెళ్లగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. అవసరం లేదనుకున్న బృందాలను ఇంటికి పంపేయనున్నారు. మెటాలో రెండో దఫా ఉద్యోగుల తొలగింపుపై ఫిబ్రవరిలోనే బ్లూమ్‌బర్గ్ న్యూస్(Bloomberg News) సంస్థ ఓ కథనాన్ని రాసింది
తాజా లేఆఫ్స్‌పై వచ్చే వారంలోగా తుది నిర్ణయం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కంపెనీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

