Pathaan Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న పఠాన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిన పఠాన్ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది.
Pathaan Movie | కరోనా ప్రభావంతో కష్టకాలంలో పడిపోయిన అన్ని ఇండస్ట్రీలు కుదురుకున్నాయి. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ తప్ప. గత రెండేళ్లుగా సరైన హిట్టు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ తేలిపోయింది. మధ్యలో ‘భూల్ భూలయా-2’, ‘దృష్యం-3’ వంటి సినిమాలు బాలీవుడ్‌కు నేనున్నా అంటూ పలకరించినా.. ఎక్కడో సౌత్ సినిమాల డామినేషన్ కనిపించింది. సౌత్ సినిమాల కలెక్షన్లు ముందు అవి నథింగ్లా అనిపించాయి. పైగా ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో బైకాట్ అంశం ఎక్కువైపోయింది. దాంతో సినిమాలు రిలీజ్ చేయాలంటేనే దర్శక, నిర్మాతల్లో ఎక్కడ లేని గుబులు. ఈ క్రమంలో అన్ని వివాదాలను ఎదుర్కొంటూ పఠాన్ జనవరి 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
రిలీజ్ ముందు నుంచి ఈ సినిమాపై ఎక్కడ లేని బజ్ ఏర్పడింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. తొలిరోజే అనుకుంటే వరుసగా ఆరు రోజులు వంద కోట్ల గ్రాస్‌కు దిగకుండా కలెక్షన్లు రాబడుతూ బాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఊపిరిపోసింది. షారుఖ్‌ఖాన్ యాక్షన్, దీపికా అందాలు, జాన్ అబ్రహం విలనిజం ప్రేక్షకులను థియేటర్లకు రిపీటెడ్‌గా వచ్చేలా చేశాయి. కాగా తాజాగా ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డు నెలకొల్పింది. బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా సంచలనం సృష్టించింది. ఇలా చెప్పుకుంటూ పోతే పఠాన్ మూవీ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. కాగా ఈసినిమా ఏప్రిల్ 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్ అబ్రహం కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

