Cold wave : దేశంలో చలిగాలుల (Cold waves) తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. హిమాలయాలకు సమీపంలోని ఉత్తరాది రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత చంపేస్తున్నది. ఈ క్రమంలో రానున్న రెండు రోజుల్లో తెలంగాణ (Telangana) లో చలి తీవ్రత మరింత పెరుగనున్నదని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. చలితోపాటు పొగమంచు (Fog) కూడా తీవ్రంగా ఉంటుందని తెలిపింది.
తెలంగాణతోపాటు కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలలోనూ తీవ్రమైన చలిగాలులు వీస్తాయని ఐఎండీ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. అత్యవసరమైతే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు బయటికి రావద్దని హెచ్చరించింది.
ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లోనూ ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ తెలిపింది.