న్యూఢిల్లీ, జూలై 31 : నైరుతి రుతుపవన సీజన్ రెండో అర్ధభాగమైన ఆగస్టు, సెప్టెంబర్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనావేసింది. ఈశాన్య, తూర్పు భారత్ మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆగస్టులో సాధారణ వర్షపాతం ఉంటుందని అంచనావేస్తున్నట్టు ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు.
గురువారం ఆయన ఆన్లైన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశమంతటా సెప్టెంబర్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం కురవొచ్చునని అన్నారు.