తిరువనంతపురం: కేరళలో శనివారం రాత్రి నుంచి కుంభవృష్టి కురుస్తున్నది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ఈ నేపథ్యంలో ఐఎండీ కేరళలోని ఆరు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీచేసింది. ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీచేసిన జిల్లాల్లో ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలు ఉన్నాయి. ఈ ఆరు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీచేసింది.
అదేవిధంగా, బంగాళాఖాతంలోని అండమాన్ దీవులవద్ద అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. రేపటికల్లా ఈ అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతానికి విస్తరిస్తుందని పేర్కొన్నది. నవంబర్ 17 నాటికి వాయుగుండంగా మారి, నవంబర్ 18న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Several areas heavily waterlogged due to incessant rains in Upper Kuttanad, Kerala. pic.twitter.com/K2N4Hvtgj7
— ANI (@ANI) November 15, 2021