న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వేసిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఖండించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవన సీజన్ (జూన్-సెప్టెంబర్)లో సాధారణ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. దాదాపు 87 సెంటీమీటర్ల దీర్ఘకాల సగటు వర్షపాతంలో 96 శాతం వర్షాలు నమోదవుతాయని ఎర్త్సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ తెలిపారు.
దేశ రైతాంగం పంట సాగుకు ఎక్కువగా రుతుపవన వర్షాలపై ఆధారపడుతుంటారు. స్కైమెట్ అంచనాతో రైతులు కొంత ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఐఎండీ ప్రకటనతో వారు ఊపిరి పీల్చుకొన్నట్టు అయింది.