IAF Trainer Aircraft | భారత వైమానిక దళానికి (IAF) చెందిన శిక్షణా విమానం (IAF Trainer Aircraft) ప్రమాదానికి గురైంది. సింగిల్ సీటర్ ట్రైనర్ విమానం చెన్నై (Chennai)లోని తాంబరం ఎయిర్ బేస్ (Tamebaramm Air Base) సమీపంలో కుప్పకూలింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పైలట్‌ను రక్షించారు. అనంతరం ప్రమాదం గురించి అధికారులకు సమాచారం ఇచ్చారు. సాధారణ శిక్షణా సమయంలో ప్రమాదవశాత్తూ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే, అదృష్టవశాత్తూ పైలట్ సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.
Also Read..
Rahul Gandhi | 95 ఓటములు.. ఆ అవార్డులన్నీ రాహుల్‌కే దక్కుతాయి.. కాంగ్రెస్ అగ్రనేతపై బీజేపీ సెటైర్లు
Tejashwi Yadav | ఓటమి దిశగా తేజస్వీ యాదవ్.. బీహార్‌లో ఎన్డీయే ప్రభంజనం
NDA | బీహార్‌లో ఎన్డీయే డబుల్ సెంచరీ.. 201 స్థానాల్లో ఆధిక్యం.. ఏ పార్టీకి ఎన్నంటే..?