న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశంలోని కొన్ని రాష్ర్టాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలు, కొండ చరియలు కూలిన ఘటనల్లో కేదార్నాథ్ ధామ్‌లో చిక్కుకుపోయిన 130 మంది యాత్రికులను భారత వైమానిక దళం(ఐఏఎఫ్) సోమవారం సురక్షితంగా తరలించింది. రాజస్థాన్, గుజరాత్లో లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోనూ వర్షాలు ప్రజల జీవనంపై ప్రభావం చూపించాయి.