శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 19:20:33

రాఫెల్‌ పైలట్లకు స్వాగతం పలికిన భదౌరియా

రాఫెల్‌ పైలట్లకు స్వాగతం పలికిన భదౌరియా

అంబాలా : హర్యానాలోని అంబాలాలోని భారత వైమానిక దళం (ఐఏఎస్‌) వైమానిక స్థావరానికి చేరుకున్న రాఫెల్‌ యుద్ధ విమానాలు, పైలట్లకు చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా బుధవారం స్వాగతం పలికారు. ఐఏఎఫ్‌లో చేరేందుకు ఫ్రాన్స్‌ నుంచి దాదాపు ఏడువేల కిలోమీటర్ల దూరం నుంచి ఇవాళ అంబాలాకు చేరిన విషయం తెలిసిందే. కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ హర్కిరాత్ సింగ్ నేతృత్వంలోని 17 గోల్డెన్ ఆరో పైలట్లతో పాటు ఇతర పైలట్లు, వింగ్ కమాండర్లు ఎంకే సింగ్, ఆర్ కటారియా, సిద్ధూ, అరుణ్‌ ఈ ఐదు జెట్లను అంబాలాకు తీసుకువచ్చారు. ఎయిర్‌బేస్‌లో దిగిన అనంతరం ఐదు రాఫెల్‌ యుద్ధ విమానాలకు వాటర్‌ సెల్యూట్‌ ఇచ్చారు. సోమవారం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన విషయం తెలిసిందే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఒక ఫ్రెంచ్ బేస్ వద్ద మొట్టమొదటిసారిగా నిలిచాయి. అక్కడకు దిగే ముందు గ్రీస్, ఇజ్రాయెల్ చుట్టూ ఎక్కడో ఒకచోట ఫ్రెంచ్ వైమానిక దళం ట్యాంకర్ విమానం ఇంధనం నింపింది. ఫ్రెంచ్ ఏరోస్పేస్ మేజర్ డసాల్ట్ ఏవియేషన్ నుంచి 36 రాఫెల్ జెట్ల కోసం 2016 సెప్టెంబర్ 23న భారత్ రూ.59వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది.

తాజావార్తలు


logo