హీరో మోటోకార్ప్ అధినేత పవన్ ముంజాల్ ఇంటిపై ఐటీ దాడులు
Pawan Munjal | దేశంలో అతిపెద్ద మోటార్ సైకిల్ తయారిదారీ సంస్థ హీరో మోటాకార్ప్ సీఈవో, ఎండీ పవన్ ముంజల్ (Pawan Munjal) ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్నది. గురుగ్రామ్‌లోని ముంజల్ ఇళ్లు, ఆఫీసుల్లో బుధవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద మోటార్ సైకిల్ తయారిదారీ సంస్థ హీరో మోటాకార్ప్ సీఈవో, ఎండీ పవన్ ముంజాల్ (Pawan Munjal) ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్నది. గురుగ్రామ్‌లోని ముంజాల్ ఇళ్లు, ఆఫీసుల్లో బుధవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముంజల్తోపాటు హీరో సంస్థలోని ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారని సమాచారం. అయితే ఐటీ దాడులకు సంబంధించి హీరో కంపెనీ కానీ, ఆదాయపు పన్ను శాఖ కానీ అధికారికంగా ఎలాంటి వివరాలు విడుదల చేయలేదు.
Income Tax department conducting searches at multiple premises of Hero Motocorp. The office and residence of promoter Pawan Munjal and premises linked to the top officials of the company are covered in this search. More details awaited: Sources
— ANI (@ANI) March 23, 2022
కాగా, ఇటీవల ఐటీ శాఖ అధికారులు ఢిల్లీ రాజధాని ప్రాంతం, చండీగఢ్, లూథియానా, లక్నో, ఇండోర్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన 45 చోట్ల సోదాలు నిర్వహించారు. అక్కడ లభించిన సమాచారం ఆధారంగా పవన్ సహా సంస్థకు సంబంధించి అధికారుల ఇండ్లలో సోదాలు చేస్తున్నట్లు తెలిసింది.
హీరో మోటోకార్ప్.. దేశంలో అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ. ఇది ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, మధ్య అమెరికాలోని 40 దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

