Loksabha Elections 2024 : మతపరమైన రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ విధానానికి సంబంధించి ఎలాంటి వివాదం లేదని, తాము భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతించదని పేర్కొన్నారు. ఈ దిశగా తమ మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టతతో పొందుపరిచామని చెప్పారు. ఇక మద్యం స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేయడంపై పవన్ ఖేరా స్పందించారు.
అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయం జరుగుతుందని తాము ఆశిస్తున్నామని అన్నారు. ఎన్నికల సందర్భంలో మీ ప్రత్యర్ధిని అరెస్ట్ చేసినప్పుడు సమన్యాయ సూత్రాలకు విరుద్ధంగా మీరు వ్యవహరించారని స్పష్టమవుతుందని కాషాయ పాలకులను ఉద్దేశించి పవన్ ఖేరా వ్యాఖ్యానించారు.
Read More :
TS Weather | మండుటెండల నుంచి ఊరట.. తెలంగాణలో ఐదురోజులు వర్షాలే..!