పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ని సింహంతో పోల్చారు. సీఎం అభ్యర్థి విషయంలో తాను రాహుల్ గాంధీ మాటకే ఓకే చెబుతానని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. ఈ వేదిక నుంచే సీఎం అభ్యర్థిత్వాన్ని కూడా ప్రకటించనున్నారు. సీఎం అభ్యర్థిగా ఎవర్ని ప్రకటించినా తనకు సమ్మతమేనని, రాహుల్ మాట జవదాటనని, సీఎం అభ్యర్థితో కలిసే పనిచేస్తానని రాహుల్ గాంధీ ముందే ప్రకటించారు. పంజాబ్‌ను ప్రేమించే వ్యక్తినని, ఈ సారి అందర్నీ కలుపుకొనిపోయే వ్యక్తి సీఎం కావాలని సిద్దూ ఆకాంక్షించారు. అయితే తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే మాత్రం రాష్ట్రంలోని మాఫియాను అంతచేసి తీరుతానని సిద్దూ ప్రకటించారు. మాఫియాను అంతం చేసి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతానని సిద్దూ హామీ ఇచ్చారు.