Massive Fire | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్ని ప్రమాదం (Huge fire) సంభవించింది. ద్వారకా (Dwarka) ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి.
అగ్నిప్రమాదంతో భయాందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు భవనంపై నుంచి కిందపడిపోయినట్లు తెలిసింది. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, పలువురు నివాసితులు ఈ మంటల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ఎనిమిది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేస్తున్నారు. భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Also Read..
Corona Virus | దేశంలో 7 వేలకు చేరువలో కరోనా యాక్టివ్ కేసులు.. 68కి పెరిగిన మరణాల సంఖ్య
Annamalai Temple | అన్నామలై ఆలయంలో మాంసాహారం తిన్న వ్యక్తి!.. తిరువణ్ణామలైలో తీవ్ర ఉద్రిక్తత
బ్లడీ హనీమూన్! మేఘాలయ ‘హనీమూన్ కేసు’లో షాకింగ్ ట్విస్ట్