న్యూఢిల్లీ: బీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్షపై పార్లమెంటు లోపల, వెలుపల వ్యక్తమవుతున్న నిరసనలపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ గురువారం స్పందించారు. ఓటర్లను అక్రమంగా తొలగిస్తున్నారనే ఆరోపణలను తోసిపుచ్చారు. నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తామని ప్రశ్నించారు.
మృతుల పేరు మీద, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారి పేరు మీద నకిలీ ఓట్లు వేసేవారికి, రెండు చోట్ల ఓట్లు వేసేవారికి, ఫేక్ ఓటర్లు లేదా ఫారిన్ ఓటర్లు నకిలీ ఓట్లు వేయడానికి ఎలా అనుమతిస్తామన్నారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని రాహుల్కు ఈసీ తెలిపింది.