Tamil Nadu | తమిళనాడులో దంచికొడుతున్న వానలు.. స్కూళ్లు, కాలేజీలు బంద్
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు (Tamil Nadu) తడిసిముద్దవుతున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి (Heavy Rains) కురుస్తున్నది. దీంతో కడలూర్, మైలాదుతురై, విల్లుపురం జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు (Tamil Nadu) తడిసిముద్దవుతున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి (Heavy Rains) కురుస్తున్నది. దీంతో కడలూర్, మైలాదుతురై, విల్లుపురం జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా పుదుచ్చేరిలో (Puducherry) కూడా స్కూళ్లు, కాలేజీలకు హాలీడే ఇచ్చారు. ఇక చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, చుద్దలోర్ జిల్లాల్లో, పుదుచ్చేరిలో మంళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎగువ వాయుగుండం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్ర తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, తమిళనాడులో తాగు, సాగునీటి అవసరాలను తీర్చడానికి ఈశాన్య రుతుపవనాలే కీలకం. గతవారం వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

