CEC Rajiv Kumar | కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఈసీగా ఇదే నా చివరి ఎన్నికల మీడియా సమావేశమని వ్యాఖ్యానించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా త్వరలోనే పదవీకాలం ముగియబోతుందని పేర్కొన్నారు. రాజీవ్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు. విలేకరుల సమావేశంలో ఈవీఎంలతో పాటు అదనపు ఓట్ల వరకు ఎన్నికల కమిషన్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
రాజీవ్ కుమార్ 15 మే 2024న రాజీవ్ కుమార్ 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 1 సెప్టెంబర్ 2020 నుంచి ఎన్నికల కమిషన్‌గా ఎన్నికల సంఘంతో అనుబంధం ఉంది. ఆయన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో 2020లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగాయి. కోవిడ్ సమయంలోనూ ఉత్తరప్రదేశ్ సహా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌తో సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. అలాగే, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటు లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను రాజీవ్ కుమార్ హయాంలోనే జరిగాయి.
రాజీవ్ కుమార్ 1960 ఫిబ్రవరి 19న జన్మించారు. ఆయన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. దాదాపు 36 సవత్సరాల పాటు వివిధ హోదాల్లో పని చేశారు. కేంద్రంలోని అనేక మంత్రిత్వశాఖలతో పాటు బిహార్, జార్ఖండ్ కేడర్‌లోనూ చాలాకాలం పాటు సేవలందించారు. సామాజిక, పర్యావరణ-అటవీ, మానవ వనరులు, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లోనూ సేవలందించారు. ఆయన ఫిబ్రవరి 2020లో కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. రాజీవ్ కుమార్ సెప్టెంబర్ 1, 2020న ఎన్నికల కమిషన్‌లో కమిషనర్‌గా నియామకమయ్యారు. నిబంధనల ప్రకారం, ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఆరు సంవత్సరాలు లేదంటే.. 65 సంవత్సరాల వయస్సు వరకు ఉంటుంది. రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 1960లో జన్మించినందున, ఆయన పదవీకాలం ఏడాది ఫిబ్రవరితో పదవీకాలం ముగియనున్నది.
#WATCH | Delhi | Election Commissioner Rajiv Kumar to announce the schedule for #DelhiElections2025, shortly
Rajiv Kumar says, “…This is my last press conference as the Chief Election Commissioner…” pic.twitter.com/K048iO2X9r
— ANI (@ANI) January 7, 2025