Floods | దేశంలోని పలు రాష్ట్రాలను వరదలు (Floods) ముంచెత్తాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి (Himachal Flash Floods). కాంగ్రా (Kangra), కులు జిల్లాల్లో సంభవించిన ఈ వరదల కారణంగా ఐదుగురు మరణించారు. ధర్మశాల (Dharamshala)లోని కొన్ని ప్రాంతాలను కూడా వరదలు చుట్టుముట్టాయి. ఈ ఆకస్మిక వరదల్లో అనేక మంది కొట్టుకుపోయినట్లు కాంగ్రా పోలీసు సూపరింటెండెంట్ షాలిని అగ్నిహోత్రి తెలిపారు.
ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు రంగంలోకి దిగినట్లు చెప్పారు. వరదలో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ దాదాపు 250 మందికిపైగా ప్రజలను సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు. ‘కొందరు ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయారు. నిన్న ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, హిమాచల్ ప్రదేశ్ హోమ్ గార్డ్ వాలంటీర్లు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 250 మందిని రక్షించగలిగారు. నిన్న రెండు మృతదేహాలను వెలిగితీగా.. ఇవాళ మూడు మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’ అని షాలిని అగ్నిహోత్రి వెల్లడించారు.
Also Read..
Rath Yatra | జగన్నాథ రథయాత్రలో అపశృతి.. జనంపైకి ఏనుగు దూసుకెళ్లడంతో తొక్కిసలాట
Bomb Threat | ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉంది.. టిష్యూ పేపర్‌పై బెదిరింపు సందేశం
Jagannath Rath Yatra | జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం.. VIDEO