Bomb Threat | ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉంది.. టిష్యూ పేపర్పై బెదిరింపు సందేశం
Bomb Threat | విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా (Air India) విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
Bomb Threat | విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా (Air India) విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని టెర్మినల్ 3 (Delhi Airport T3) వద్ద ఉన్న విమానానికి ఈ బెదిరింపులు వచ్చాయి. విమానంలోని క్యాబిన్లో ‘ఎయిర్ ఇండియా 2948 @ T3లో బాంబు ఉంది’ అనే సందేశంతో కూడిన టిష్యూ పేపర్ (Tissue Paper)ను సిబ్బంది గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఇది బూటకపు బెదిరింపుగా అధికారులు తేల్చారు.ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Jagannath Rath Yatra | జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం.. VIDEO
Civil Engineer | కారు నడుపుతూ కునుకుతీసిన సివిల్ ఇంజినీర్.. కళ్లు తెరిచేలోపు ఘోరం జరిగిపోయింది!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

