Jagannath Rath Yatra | ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు (Devotees) తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా జగన్నాథుడి రథయాత్రను వీక్షిచేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ (Puri) క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ వేడుకలో 12 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అధికారుల అంచనా. దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఒడిశా ప్రభుత్వం.. తొలిసారిగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు.
#WATCH | Puri, Odisha: A sea of devotees gather and rejoice outside the Shri Jagannath Temple to witness the world-famous annual Rath Yatra of Lord Jagannath and his two siblings. pic.twitter.com/qvi7QhSaJE
— ANI (@ANI) June 27, 2025
#WATCH | Odisha | Sea of devotees gather outside the Shri Jagannath Temple to witness the world-famous annual Rath Yatra of Lord Jagannath and his two siblings in Puri pic.twitter.com/6UU5EgOz9i
— ANI (@ANI) June 27, 2025
Also Read..
Massive Fire | పెయింట్స్ కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసి పడుతున్న మంటలు, కమ్మేసిన పొగ
Civil Engineer | కారు నడుపుతూ కునుకుతీసిన సివిల్ ఇంజినీర్.. కళ్లు తెరిచేలోపు ఘోరం జరిగిపోయింది!