Rajnath Singh | రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి హాజరైన రక్షణ మంత్రి.. ఇవాళ చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్జున్ (Admiral Don Jun)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డాంగ్జున్తో ద్వైపాక్షిక చర్చలు (Bilateral Talks) జరిపారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి, చైనాతో దౌత్య సంబంధాలను మెరుగుపరచడానికి నాలుగు అంశాల ఫార్ములా (4-pronged plan) ను రాజ్నాథ్ ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నాలుగు అంశాల్లో.. 2024లో బలగాల ఉపసంహరణ కోసం చేసుకున్న ఒప్పందానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండటం, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను పూర్తిగా చల్లార్చేందుకు నిరంతర ప్రయత్నాలు కొనసాగించడం, సరిహద్దుల మార్కింగ్, డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేసి వివాదాలకు శాశ్వత ముగింపు పలకడం, ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలన పరిష్కరించుకొని సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇప్పటికే ఉన్న ప్రత్యేక ప్రతినిధుల స్థాయి యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కొత్త ప్రక్రియలను రూపొందించడం ఉన్నాయి. ఇక ఈ భేటీలో ఉగ్రవాదం, ఆపరేషన్ సిందూర్ వంటి అంశాలను కూడా చైనా రక్షణ మంత్రి ముందు రాజ్నాథ్ ప్రస్తావించారు.
Also Read..
పహల్గాం ఉగ్ర దాడి ప్రస్తావన ఏదీ?
“Rajnath Singh | పహల్గాం ప్రస్తావన లేకుండానే ఎస్సీవో పత్రం.. సంతకం చేయని రాజ్నాథ్ సింగ్”
“Rajnath Singh | ఆపరేషన్ సిందూర్ మా హక్కు.. చైనా గడ్డనుంచే పాక్పై నిప్పులు చెరిగిన రాజ్నాథ్”
“Rajnath Singh | చైనాలో ఎస్సీవో రక్షణ మంత్రుల సమావేశం.. హాజరైన రాజ్నాథ్ సింగ్”