కింగ్డావో, జూన్ 26: చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశ సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం తిరస్కరించారు.
పాకిస్థాన్ చేసిన పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని విస్మరించడమే కాక, పాకిస్థాన్ మద్దతు గల సీమాంతర ఉగ్రవాదంపై భారత్ ఆందోళనను స్పష్టంగా ప్రస్తావించకపోవడంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చైనా ఓడరేవు నగరంలో జరిగిన ఎస్సీవో రక్షణ మంత్రుల సమావేశం ఉమ్మడి ప్రకటన లేకుండానే ముగిసింది.