నోయిడా: ఢిల్లీ శివార్లలోని నోయిడాలో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) జరిగింది. నోయిడాలోని సెక్టార్ 2లో ఉన్న ఓ పెయింట్ ఇండస్ట్రీలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. క్రమంగా అవి పెద్దవికావడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా నల్లని పొగలు దట్టంగా కమ్మేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిని ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
#WATCH | Uttar Pradesh | A fire breaks out at a private firm in Noida Sector 2. Fire tenders are at the spot. More details awaited. pic.twitter.com/ZZxzAf7nRT
— ANI (@ANI) June 27, 2025
కాగా, ఇప్పటివరకు ఎవరూ గాయపడలేదని, ఆస్థి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. శ్యామ్ పెయింట్స్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం జరిగిందన్నారు. స్థానిక పోలీసులతో కలిసి ఏడు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
Ambulance en route to area near Sector 18, Noida.
Fire and flames still visible, emanating from the top of the building
6:25am, today. pic.twitter.com/P2AMGYgo0A
— akash soni (@AkaskSoni) June 27, 2025