Rath Yatra | నేడు జగన్నాథుడి రథయాత్ర (Jagannath Rath Yatra). ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను దేశ వ్యాప్తంగా భక్తులు ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇవాళ పలు ప్రధాన నగరాల్లో జగన్నాథుడి రథయాత్రకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో గుజరాత్లో నిర్వహించిన ఈ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.
గుజరాత్‌లోని గోల్వాడ (Golawad) వద్ద జగన్నాథుడి రథయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రథయాత్ర కోసం తీసుకొచ్చిన ఓ ఏనుగు (Gajraj) జనసమూహాన్ని చూసి బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగు దాడి నుంచి తప్పించుకునేందుకు ఎక్కడివారు అక్కడ పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ఏనుగును అదుపు చేశారు. తొక్కిసలాటలో గాయపడిన భక్తులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Also Read..
Jagannath Rath Yatra | జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం.. VIDEO
Bomb Threat | ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉంది.. టిష్యూ పేపర్‌పై బెదిరింపు సందేశం