Heat Wave | న్యూఢిల్లీ: చరిత్రలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా 2024 రికార్డులకు ఎక్కినట్టు ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ ైక్లెమేట్ చేంజ్ సర్వీస్ శుక్రవారం వెల్లడించింది. అంతర్జాతీయ వాతావరణాన్ని నమోదు చేయడం 1850లో ప్రారంభమైందని, అప్పటి నుంచి అత్యంత ఎక్కువ వేడి వాతావరణం గత ఏడాదే నమోదైనట్టు తెలిపింది.
మనుషులు శిలాజ ఇంధనాలు కాల్చడం ప్రారంభించడానికి ముందు(పూర్వ పారిశ్రామిక దశ) కాలమైన 1850-1900 సగటును పరిగణనలోకి తీసుకుంటే 2024 వార్షిక ఉష్ణోగ్రత సగటులో 1.60 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యిందని ప్రకటించింది. ఒక క్యాలెండర్ ఏడాది సగటులో పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి అని తెలిపింది. 2024లో జనవరి నుంచి జూన్ వరకు అన్ని నెలలూ గతంలో ఆయా నెలల్లో నమోదైన ఉష్ణోగ్రతల రికార్డులను బ్రేక్ చేశాయని ఈ సంస్థ వెల్లడించింది.