Ayodhya | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లే దారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.
ఇక కుంభమేళా ఎఫెక్ట్‌తో ప్రస్తుతం యూపీలోని ప్రఖ్యాత ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. కుంభమేళాకు వచ్చిన భక్తులు అట్నుంచి అటు కాశీ, అయోధ్య వెళ్తున్నారు. దీంతో ఆయా ఆలయాల్లో సాధారణం కంటే అధిక సంఖ్యలో రద్దీ నెలకొంది. తాజాగా అయోధ్య వెళ్లే దారుల్లో ట్రాఫిక్ జామ్ తలెత్తింది. కాశీలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అంతా అయోధ్య వైపు దారి మళ్లుతున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ టు అయోధ్య రహదారి వాహనాలతో కిక్కిరిసిపోతోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తులు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే మగ్గిపోతున్నారు.
ప్రయాగ్‌రాజ్ నుంచి అయోధ్యకు 270 కిలోమీటర్ల దూరం ఉంది. సాధారణ సమయంలో మూడు నుంచి నాలుగు గంటల్లో అయోధ్య చేరుకునేవారు. అయితే, కుంభమేళా ఎఫెక్ట్‌తో అయోధ్యకు వెళ్లడానికి దాదాపు 36 గంటలకుపైగా సమయం పడుతోందంట. దీంతో యాత్రికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోవాల్సి వస్తోందని.. ఆహారం, నీళ్లు లేక అలమటిస్తున్నట్లు వాపోతున్నారు. కుంభమేళా వేళ అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రోజూ లక్షల్లో భక్తులు రామ్‌లల్లా దర్శనానికి పోటెత్తుతున్నారు. దీంతో రాముడి దర్శనానికి గంటల సమయం పడుతోంది. మరోవైపు కాశీలోనూ అదే పరిస్థితి ఏర్పడింది.
Jai Shree Ram 🙏 #Ayodhya pic.twitter.com/7syN1Ck0Ip
— Manish Pangotra🇮🇳 (@ManishPangotra5) February 14, 2025
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే 49 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.
Also Read..
Actor Vijay | కేంద్రం కీలక నిర్ణయం.. నటుడు విజయ్‌కి వై కేటగిరీ భద్రత
Deportation | యూఎస్‌లో అక్రమ వలసదారుల ఏరివేత.. మరో రెండు విమానాల్లో స్వదేశానికి భారతీయులు..!
Delhi CM | ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. 15 మంది ఎమ్మెల్యేలతో జాబితా సిద్ధం..!