Actor Vijay | తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు, తమిళ వెట్రి కజగం (Tamilaga Vetri Kazhagam) చీఫ్ విజయ్ (Actor Vijay) భద్రత విషయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు వై+ కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ (Ministry of Home Affairs) ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విజయ్‌కి 24 గంటల పాటు సాయుధ గార్డులు రక్షణ కల్పిస్తారని పోలీసులు వర్గాలు తెలిపాయి.
కాగా, పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం భద్రత స్థాయిని నిర్ణయిస్తుంది. వై ప్లస్ భద్రత నాలుగో అత్యున్నత స్థాయి భద్రత. మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా భద్రత కల్పిస్తారు. వారిలో ఇద్దరి నుంచి నలుగురు కమాండోలు, మిగిలినవారు పోలీసు సిబ్బంది ఉంటారు. విజయ్ కాన్వాయ్‌లో ఒకటి లేదా రెండు వాహనాలు ఉంటాయి.
కాగా, స్టార్ నటుడు అయిన విజయ్ దళపతి (Actor Vijay) గతేడాది రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం (Tamilaga Vetri Kazhagam) పేరుతో పార్టీని ప్రకటించారు. ఇక 2026లో జరిగే ఎన్నికల బరిలో దిగుతామని పార్టీని ప్రారంభించిన సమయంలోనే విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Deportation | యూఎస్‌లో అక్రమ వలసదారుల ఏరివేత.. మరో రెండు విమానాల్లో స్వదేశానికి భారతీయులు..!
Delhi CM | ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. 15 మంది ఎమ్మెల్యేలతో జాబితా సిద్ధం..!
Elephants | ఆలయ ఉత్సవాల్లో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు