Snowfall | దేశంలోని మూడు రాష్ట్రాల్లో భారీగా మంచు (Heavy Snowfall) కురుస్తోంది. జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir), హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాల్లో మంచు తీవ్రంగా ఉన్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. కనుచూపుమేర శ్వేత వర్ణం అలుముకుంది. అక్కడ రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోవడంతో అధికారులు పలు రహదారుల్ని మూసివేశారు (Blocks Key Highways).
#WATCH | J&K: Jammu-Srinagar National Highway closed due to snow accumulation between Ramsoo and Qazigund, shooting stones/landslides/mudslides between Nashri and Navyug Tunnel.A large number of vehicles halted at Jakhani on Jammu-Srinagar National Highway, Udhampur. pic.twitter.com/t6wVfHx2C5
— ANI (@ANI) February 28, 2025
జమ్ముకశ్మీర్‌లో ఎడతెరిపిలేకుండా మంచు కురుస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో ఉదంపూర్ వద్ద రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు రోడ్డుపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు.
#WATCH | Himachal Pradesh | Lahaul and Spiti are covered in a thick blanket of snow as the area receives a fresh spell of heavy snowfall. pic.twitter.com/PuLyJLZFFr
— ANI (@ANI) February 28, 2025
హిమాచల్‌ప్రదేశ్‌లోనూ విపరీతంగా మంచు పడుతోంది. లెహ్, స్పితి సహా పలు ప్రాంతాల్లో నిరంతరంగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో ఇళ్లు, వాహనాలు, రోడ్లు, చెట్లపై దట్టంగా మంచు పేరుకుపోయింది. ఇక ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో తాజాగా వర్షం కురిసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#WATCH | Fresh spell of rain lashes part of Uttarakhand’s capital, Dehradun pic.twitter.com/7eApbkDAvn
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 28, 2025
#WATCH | Rajouri, J&K | After a long dry spell, the elevated areas of the Pir Panjal mountain range received snowfall, while the lower areas received rainfall pic.twitter.com/EwWyIpuK1w
— ANI (@ANI) February 28, 2025
#WATCH | J&K | Border Roads Organisation (BRO) engaged in the snow clearance at the Srinagar airport runway after the area received fresh snowfall today: BRO officials
(Video – BRO) pic.twitter.com/Z4DQg5K5oa
— ANI (@ANI) February 28, 2025
#WATCH | A mesmerizing white landscape has enveloped the Gandoh Bhalesa Mountain in Jammu & Kashmir’s Doda as a fresh spell of heavy snowfall blankets the region pic.twitter.com/nVxxIoDuUG
— ANI (@ANI) February 28, 2025
Also Read..
Threat Message | మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు బెదిరింపులు.. పాకిస్థాన్ నంబర్ నుంచి మెసేజ్
Maha Kumbh | కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు.. వ్యక్తి అరెస్ట్
SEBI chief | సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండే నియామకం