Threat Message | మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis)కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు పాకిస్థాన్ ఫోన్ నంబర్ (Pakistani number) నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
శుక్రవారం ఉదయం పాకిస్థాన్ నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా ముంబై ట్రాఫిక్ పోలీసులకు (Mumbai cops) ఓ మెసేజ్ (Threat Message) వచ్చింది. అందులో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ కార్యాలయంపై దాడి చేయనున్నట్లు బెదిరింపులకు పాల్పడ్డారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి తనను తాను మాలిక్ షాబాజ్ హుమాయున్ రాజా దేవ్‌గా పేర్కొన్నారు. బెదిరింపు మెసేజ్‌తో వెంటనే అప్రమత్తమైన ముంబై పోలీసులు సీఎం భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాదు, ఈ బెదిరింపు మెసేజ్‌పై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఇటీవలే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. షిండే కారును బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ముంబై పోలీసులకు మెయిల్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా అది బూటకమని తేలింది. ఇప్పుడు సీఎంకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
Also Read..
Maha Kumbh | కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు.. వ్యక్తి అరెస్ట్
SEBI chief | సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండే నియామకం
Donald Trump | ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని నిలిపివేసిన డిస్ట్రిక్ట్ జడ్జ్