Donald Trump | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు (mass firings by US agencies) విషయంలో ట్రంప్ నిర్ణయానికి డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ (District Judge William Alsup) బ్రేకులు వేశారు. భారీ సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేశారు.
కాగా, అమెరికా ప్రభుత్వ వ్యయాల తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా పలు విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులను ట్రంప్ సర్కార్ తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో అమెరికాలో ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ చట్టవిరుద్ధమైన ఆదేశాలపై పలు యూనియన్లు, న్యాయవాద సంఘాలు దావా వేశాయి. దీనిపై తాజాగా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ తీర్పును వెలువరించారు. అధ్యక్షుడి నిర్ణయాన్ని నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఈ తీర్పుతో ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
Also Read..
Indian Student | కోమాలో భారత విద్యార్థిని.. ఆమె తల్లిదండ్రులకు అత్యవసర వీసా మంజూరు
గోల్డ్ కార్డుతో భారతీయులకు ఉద్యోగాలు