ఖాన్ యూనిస్(గాజా స్ట్రిప్): ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాద సంస్థ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తున్నది. ఇజ్రాయెలీ అధికారి ఒకరు గురువారం మాట్లాడుతూ, ఫిలడెల్ఫీ కారిడార్‌గా పిలవబడుతున్న ప్రాంతంలో తమ సైన్యం కొనసాగవలసిన అవసరం ఉందన్నారు.
ఆయుధాల అక్రమ రవాణాను నిరోధించేందుకు తమ సైన్యాలు ఇక్కడే ఉండాలని చెప్పారు. ఈజిప్టు సరిహద్దుల్లో గాజా వైపు ఈ ప్రాంతం ఉంది. ఈ కారిడార్‌లో బఫర్ జోన్‌ను కొనసాగించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని హమాస్ హెచ్చరించింది.