Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజులపాటూ సాగిన అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగిసింది. అయితే, అక్కడ సంగమంలో స్నానాలు చేస్తున్న మహిళా భక్తులకు సంబంధించిన వీడియోలు (Women Bathing Videos), ఫొటోలు తీసి కొందరు సోషల్ మీడియాలో విక్రయిస్తున్న ఉదంతం ఇటీవలే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై యూపీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
నిందితుడు పశ్చిమ బెంగాల్‌లోని (Bengal man arrested) హుగ్లీ జిల్లాకు చెందిన అమిత్ కుమార్ ఝాగా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. యూట్యూబ్‌లో కంటెంట్‌తో డబ్బు సంపాదించేందుకు వీడియోలను చిత్రీకరించినట్లు విచారణలో నిందితుడు అంగీకరించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు గురువారం తెలిపారు. అతడిపై పలు సెక్షన్ల కింద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Also Read..
Donald Trump | ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని నిలిపివేసిన డిస్ట్రిక్ట్ జడ్జ్
SEBI chief | సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండే నియామకం
Jaya Prada | సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం