Jaya Prada | ప్రముఖ సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద (Jaya Prada) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు రాజ బాబు (Raja Babu) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నివాసంలో గురువారం మధ్యాహ్నం రాజ బాబు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని జయప్రద స్వయంగా ఇన్‌స్టా వేదికగా తెలిపారు.
‘నా అన్నయ్య రాజ బాబు మరణవార్తను మీకు తెలియజేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఈరోజు మధ్యాహ్నం 3.26 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించండి. మరిన్ని వివరాలు త్వరలోనే పంచుకుంటాం’ అని తన పోస్ట్‌లో జయప్రద పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు జయప్రద కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. రాజబాబు ఆత్మక శాంతి చేకూరాలంటూ పోస్టులు పెడుతున్నారు.
Also Read..
Posani Krishna Murali | పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్.. రాజంపేట జైలుకు తరలింపు
కరుణాకరన్ దర్శకత్వంలో దిల్‌రాజు సినిమా