గత కొంతకాలంగా భారీ హిట్‌కోసం ఎదురుచూస్తున్నారు అగ్ర హీరో సల్మాన్‌ఖాన్. ఈ నేపథ్యంలో తాజా చిత్రం ‘సికందర్’ పైనే ఆయన ఆశల్ని పెట్టుకున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నదియావాలా తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
రష్మిక మందన్న కథానాయికగా నటించింది. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. హై ఇంటెన్సిటీ యాక్షన్ ఘట్టాలు, రియల్ స్టంట్స్‌తో టీజర్ గ్రిప్పింగ్‌గా సాగింది. తనదైన యాక్షన్ అవతార్‌లో సల్మాన్‌ఖాన్ మెస్మరైజ్ చేశారు. ఇందులో మరోమారు సల్మాన్‌ఖాన్ పవర్‌ప్యాక్డ్ యాక్షన్‌ను చూస్తారని చిత్రబృందం చెబుతున్నది. కాజల్ అగర్వాల్, సునీల్‌శెట్టి, సత్యరాజ్ తదితరులు చిత్ర తారాగణం.