జమ్ముకశ్మీర్లో భారీగా కురుస్తున్న మంచు.. స్తంభించిన జనజీవనం.. ఫొటోలు
జమ్ముకశ్మీర్లో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో భూతల స్వర్గం మరింత అందాలను పులుముకున్నది. హిమపాతం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ఆస్వాదిస్తున్నారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో భూతల స్వర్గం మరింత అందాలను పులుముకున్నది. హిమపాతం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ఆస్వాదిస్తున్నారు. రాష్ట్రంలో ఆదివారం రాత్రి నుంచి నిరాటంకంగా మంచు పడుతున్నది. కొన్ని ప్రాంతాల్లో హిమం గుట్టలుగా పేరుకుపోయింది. దీంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. మంచుధాటికి జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


కాగా, రాంబన్ జిల్లాలోని రాంపడి-బనిహల్ మధ్య 44వ నంబర్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు బండరాళ్లను తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ ఇష్యూ చేశారు.
#WATCH | J&K | A major slide has occurred near Rampadi, Banihal, on National Highway-44. People are advised to follow J&K Traffic Police advisory: Deputy Commissioner, Ramban
(Video: Deputy Commissioner, Ramban) pic.twitter.com/b2EYVf1dAd
— ANI (@ANI) February 1, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

