Uttarkashi | దేవభూమి ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ (Uttarkashi)లో జల విలయం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పవిత్ర చార్ధామ్లలో ఒకటైన గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలి (Dharali) గ్రామంపై మంగళవారం ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. కుంభవృష్టి కారణంగా వచ్చిన మెరుపు వరదలకు కొండచరియలు విరిగిపడి ఇళ్లు, హోటళ్లు, కార్లు కొట్టుకుపోయాయి. ఈ విలయంలో ఇప్పటి వరకూ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 నుంచి 70 మంది గల్లంతయ్యారు. ఇక ఇప్పటి వరకూ దాదాపు 130 మందిని రెస్క్యూ టీమ్ రక్షించింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అయితే, ఇవాళ కూడా ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలిలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (weather department) హెచ్చరించింది. రాష్ట్రంలోని కొండ ప్రాంతంల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, బాగేశ్వర్, పౌరి, తెహ్రీ, హరిద్వార్, డెహ్రాడూన్.. ఈ ఏడు జిల్లాలకు భారీ వర్షసూచన చేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ఆయా జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పౌరి, చంపావత్, ఉదమ్ సింగ్ నగర్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు.
Also Read..
ఉత్తరాఖండ్‌లో జల విలయం.. నలుగురి మృతి.. సుమారు 60-70 మంది గల్లంతు
Kalp Kedar Temple: ఉత్తరాఖండ్ వరదలు.. బురద, రాళ్లతో కూరుకుపోయిన ప్రాచీన కల్పకేదార్ శివాలయం
Airports | ఉగ్రముప్పు హెచ్చరికలు.. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్స్‌లో హైఅలర్ట్