Airports | దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు (Airports) ఉగ్రముప్పు (Terror Threat) పొంచి ఉందని నిఘా వర్గాలు (intelligence) హెచ్చరించాయి. సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు (All Airports On High Alert).
సెప్టెంబర్ 22, అక్టోబర్ 2 మధ్య ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (Bureau of Civil Aviation Security) దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు, హెలిప్యాడ్లు, వైమానిక దళ స్థావరాలు, ఫ్లైయింగ్ స్కూల్స్ వద్ద భద్రతను పెంచాలని సూచించారు. ఈ ఆదేశాలతో విమానాశ్రయాల వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. టెర్మినల్స్, పార్కింగ్ ఏరియా తదితర ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పెంచారు. ఎయిర్‌పోర్టులకు వెళ్లే మార్గాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. విమానాశ్రయాల వద్ద ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్‌ను యాక్టివేట్ చేశారు. అవసరమైతే మాక్ డ్రిల్స్ నిర్వహించాలని పౌర విమానయాన భద్రతా బ్యూరో సంబంధిత అధికారులకు సూచించింది.
Also Read..
Bihar Murder: కులాంతర వివాహం.. కుమార్తె ముందే అల్లుడిని కాల్చి చంపేశాడు
Ajit Doval | ట్రంప్ సుంకాల బెదిరింపు వేళ.. రష్యా పర్యటనకు అజిత్ దోవల్
Kalp Kedar Temple: ఉత్తరాఖండ్ వరదలు.. బురద, రాళ్లతో కూరుకుపోయిన ప్రాచీన కల్పకేదార్ శివాలయం