ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో మంగళవారం క్లౌడ్‌బస్ట్ విలయం సృష్టించిన విషయం తెలిసిందే. ఖేర్ గంగా నదిలో ఆక్మసిక వరదలు వచ్చాయి. దీంతో హర్సిల్ ప్రాంతంలో ఉన్న ప్రాచీన కల్పకేదార్( Kalp Kedar) శివాలయం .. ఆ బురద నీటి ప్రవాహంలో మునిగిపోయింది. ఆలయ శిఖరం మాత్రమే స్వల్పంగా కనిపిస్తున్నది. కల్ప కేదార్ ఆలయం నమోద.. కేదార్నాథ్ ఆలయం తరహాలోనే ఉంటుంది. ఆ ఆలయ శిఖరం .. కేదార్నాథ్ ఆలయ శిఖరం ఒకే రూపంలో కనిపిస్తున్నాయి. కల్ప కేదార్ టెంపుల్ గతంలో కూడా ప్రకృతి విలయానికి జలమయమైంది. ఆ శివాలయ ఆర్కిటెక్చర్ కతూరే శైలిలో ఉంటుంది. కేదార్థామ్లోని శివాలయం కూడా ఇదే శైలిలో నిర్మించారు.
1945లో జరిపిన తవ్వకాల్లో ఈ ఆలయం బయటపడింది. ఎన్నో ఫీట్ల లోతుకు ఈ ఆలయాన్ని తొవ్వాల్సి వచ్చింది. ఈ గుడి గ్రౌండ్లెవల్లో ఉంటుంది. ఆలయంలో పూజలు చేయాలనుకునే భక్తులు మైనస్ లెవల్‌కు పోవాల్సి వస్తుంది. ఆలయ గర్భగుడిలో ఉన్న శివలింగపై ఖేర్ గంగా బిందువులు వచ్చి పడుతుంటాయని స్థానికులు చెబుతుంటారు. ఆలయం చుట్టూ అలనాటి శిల్ప కళా సౌందర్యం కూడా ఉంటుంది. గర్భగుడిలో ఉన్న శివలింగం.. నంది వెనుకభాగం షేప్‌లో ఉంటుంది. ఒక రకంగా కేదార్నాథ్ ఆలయంలో ఉన్న శివుడి రూపానికి రమారమీగా ఉంటుంది.
Kalp Kedar temple at Dharali enroute Gangotri Ji was a temple complex that used to have 240 temples. The complex perished in the floods at the beginning of the 19th century. This temple was found after villagers located a shikhar of the temple in 1945. Later upon excavation, they… pic.twitter.com/jryzTLCReb
— Alok Bhatt (@alok_bhatt) May 5, 2024
హిమాలయాల్లో ఉన్న రహస్య సంపదగా కల్ప కేదార్ ఆలయాన్ని గుర్తించారు. గంగానది మూలస్థానం ఆ ఆలయంలోనే ఉన్నట్లు కొందరు భావిస్తారు. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్లు ఇక్కడి స్థానికులు చెబుతుంటారు. 1935-38 మధ్య సంభవించిన భూప్రళయం వల్ల ఈ ఆలయం మునిగినట్లు చెబుతారు. ఉత్తరకాశీ జిల్లా కేంద్రం నుంచి గంగోత్రికి వెళ్తున్న మార్గంలో నదీ తీరం వద్ద కల్పకేదార్ ఆలయం ఉన్నది.
సోమవారం వచ్చిన జలవిలయంలో భారీ విధ్వంసం జరిగింది. 20 నుంచి 25 హోటళ్ల వరకు నేలమట్టం అయ్యాయి. ఓ క్యాంపులో ఉన్న 12 మంది సైనికులు గల్లంతు అయ్యారు. ప్రస్తుతం కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలో సైనిక బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఉత్తరకాశీ-హర్సిల్ రోడ్డు మార్గంలో ఉన్న భట్వాడి వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. వరద ధాటికి అది కొట్టుకుపోయింది. హర్సిల్ మార్గాన్ని రాత్రంతా మూసివేశారు.
#WATCH | Uttarakhand: Due to a cloudburst, the Uttarkashi-Harsil road in Bhatwadi has been completely washed out. The road towards Harsil was completely blocked the entire night.
Dharali, where the cloudburst incident took place yesterday, is 50 km away from here. pic.twitter.com/mMiph62GCM
— ANI (@ANI) August 6, 2025