అహ్మదాబాద్: గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఏడుగురు ప్రా ణాలు కోల్పోయారు. అధికారులు దాదాపు 15,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 300 మందిని సహాయక బృందాలు కాపాడాయి. దేవభూమి ద్వారక, ఆనంద్, వడోదర, ఖేడ, మోర్బి, రాజ్‌కోట్ జిల్లాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. వర్షాల ధాటికి సురేందర్‌నగర్ జిల్లాలో ఓ బ్రిడ్జి కూలిపోయింది.