చెన్నై: పుదుచ్చేరి, తమిళనాడు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన దంచికొడుతున్నది. దీంతో తమిళనాడు డెల్టా ప్రాంతంలో 8 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై, పుదుచ్చేరి సహా మరో ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఆదేశాలు ఇచ్చింది. పుదుచ్చేరిలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రభుత్వ దవాఖాన జలదిగ్బంధంలో చిక్కుకున్నది. దీంతో అప్రమత్తమైన అధికారులు పేషెంట్లను మరో హాస్పిటల్‌కు తరలించారు. భారీగా కురుస్తున్న వర్షాలతో వరదలు సంబవిస్తుండటంతో.. చెన్నై, పుదుచ్చేరి మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో వరద నీరు సబ్‌వేలోకి చేరింది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో అలర్టైన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు.
కాగా, తమిళనాడు, పుదుచ్చేరి సహా పది రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 12 నుంచి 16 వరకు వానలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్, గుజరాత్లో ఈ నెల 12న భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది.
Rainfall Warning : 12th October to 16th October 2024
वर्षा की चेतावनी : 12th अक्टूबर से 16th अक्टूबर 2024#rainfallwarning #IMDWeatherUpdate #stayalert #staysafe #assam #meghalaya #nagaland #manipur #mizoram #Tripura #kerala #Tamilnadu #arunachalpradesh #Kerala #WestBengal… pic.twitter.com/4OZrKE2gvP— India Meteorological Department (@Indiametdept) October 10, 2024