న్యూఢిల్లీ, జూలై 23: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు చోట్ల రోడ్లపై మోకాలి లోతుకు పైగా నీరు నిలిచిపోయింది. దీంతో ఒక వ్యక్తి రోడ్డుపై భారీగా నిలిచిపోయిన నీటిలో ఈతకొట్టాడు. ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి ఆతిశీ తీవ్ర విమర్శలు చేశారు. ‘రాజధాని ఢిల్లీలో చాలా ఈత కొలనులు ప్రారంభించినందుకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు అభినందనలు తెలియజేస్తున్నాను’ అని ఆతిశీ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు.
‘ఢిల్లీ అంతా ఇప్పుడు చిన్న వానకే నీట మునుగుతున్నది. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి?’ అని ఆమె రేఖాగుప్తాను ప్రశ్నించారు. నీటితో నిండిన ఎన్హెచ్ 24పై టబ్పై ప్రయాణిస్తూ ఆప్ కార్పొరేటర్ గీతా రావత్ ఒక వీడియోను షేర్ చేశారు.