న్యూఢిల్లీ, ఆగస్టు 30: అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కచ్ తీరం, పరిసర పాకిస్థాన్ ప్రాంతాల్లో ‘అస్నా’ సైక్లోన్‌గా మార్పు చెందిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా సాగుతున్నదని, రాబోవు రెండు రోజుల్లో భారత తీరానికి దూరంగా వెళ్లే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. కాగా, అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని చోట్ల వరద పరిస్థితులు నెలకొన్నాయి. 1976 తర్వాత అరేబియా సముద్రంలో ఆగస్టులో తుఫాన్ ఏర్పటడం ఇదే తొలిసారి.