జైపూర్, జూన్ 4: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపుమీదున్న బీజేపీకి సార్వత్రిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్లోని 25 స్థానాలకుకు గానూ 24 సీట్లను గెలుపొందిన ఆ పార్టీ ఈసారి చతికిలపడింది. గతంతో పోలిస్తే 10 సీట్లను కోల్పోయిన కమలం పార్టీ 14 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏకంగా సీఎం ఇలాకాలో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలవడం గమనార్హం.
మరోవైపు సీపీఐ(ఎం), రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ)లతో కలిసి బరిలో దిగిన కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన భారత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ) కూడా ఒక స్థానంలో విజయం సాధించింది. దీంతో రాజస్థాన్లో ఇండియా కూటమి బలం 11కు చేరింది. మరోవైపు బగిడోర అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో బీపీఏ జయకేతనం ఎగురవేసింది.