న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని జేవర్ వద్ద రూ.3,706 కోట్ల వ్యయం తో సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు ఆటోమొబైల్స్ తయారీకి అవసరమయ్యే డిస్ప్లే డ్రైవర్ చిప్స్‌ను ఉత్పత్తి చేసేందుకు హెచ్‌సీఎల్-ఫాక్స్‌కాన్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్లాంట్‌లో 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.