Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజధానిలో పొలిటికల్ హీట్ నెలకొంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇక బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా (Haryana) ప్రభుత్వంపై ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. హర్యానా ప్రభుత్వం తమకు సరఫరా చేస్తున్న నీటిలో విషం కలుపుతోందని (Yamuna Poisoning) మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేజ్రీ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కేజ్రీపై చట్టపరమైన చర్యలకు హర్యానా ప్రభుత్వం సిద్ధమైంది.
హర్యానా ప్రభుత్వంపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనపై కేసు నమోదు చేయనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ (Vipul Goyal) బుధవారం తెలిపారు. కేజ్రీవాల్ బాధ్యతా రహితమైన ప్రకటన చేశారని.. ఆయన ప్రకటన వల్ల హర్యానా, ఢిల్లీ ప్రజల్లో భయాందోళన నెలకొందన్నారు. సోనిపట్‌లోని చీఫ్ జ్యుడీషియల్ కోర్టులో డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, హర్యానా ప్రభుత్వం తమకు సరఫరా చేస్తున్న నీటిలో విషం కలుపుతున్నదని, దీని కారణంగా రాజధానిలో సామూహిక మరణాల ప్రమాదం ఉందని సోమవారం మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. దీని కారణంగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలకు ఆ కలుషిత నీటి సరఫరాను నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చునని చెప్పారు. ఈ ఆరోపణలను తిరస్కరించిన హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, ఎంపీ ధరంవీర్ సింగ్, ఇతర ఎంపీలు వారిపై మండిపడ్డారు. తమ గౌరవానికి భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్‌పై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ ఆరోపణలు హర్యానా ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని ధరంవీర్ సింగ్ తెలిపారు.
మీ ఆరోపణలపై ఆధారాలు చూపండి:ఈసీ
కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు రుజువు చేసే వాస్తవిక ఆధారాలను చూపాలని భారత ఎన్నికల సంఘం ఆయనను కోరింది. యమునా నీటిని విషపూరితంగా మార్చే రసాయనాల స్వభావం, వాటి వివరాలను బుధవారం రాత్రి 8 గంటల్లోగా తమకు సమర్పించాలని ఒక లేఖలో ఆదేశించింది.
Also Read..
Mallikarjun Kharge | మహా కుంభమేళా సందర్భంగా గంగా నదిలో మునిగితే పేదరికం తొలగిపోతుందా?: ఖర్గే